నిజాంబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో ఓ గర్భిణీకి చేయూతను అందించిన బోధన్ ఏసిపి కిరణ్ కుమార్ పట్ల ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పోలీసులంటేనే భయపడే ఈ రోజుల్లో పోలీస్ డివిజనల్ అధికారి తనకు సంబంధం లేని ఆసుపత్రి వ్యవహారంలో కలగజేసుకుని తమ సిబ్బందిని అలర్ట్ చేసి ఓ మహిళకు వైద్యం అందించడం.. పండంటి బిడ్డకు ఆ తల్లి జన్మనివ్వడం పోలీస్ శాఖ కిరణ్ కుమార్ సేవలు వన్నె తెచ్చే విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో రుద్రూర్ మండలం రాజీవ్ నగర్ కాలనీ కి చెందిన నాగలక్ష్మి అనే ఒక ప్రసవ మహిళా ప్రభుత్వాసుపత్రికి రాత్రిపూట పోతే డెలివరీ చెయ్యకపోగా ..బయటికి గెంటేశారని బాధిత మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గంటల తరబడి ఎంత ప్రాధేయ పడ్డా ఆసుపత్రి సిబ్బంది ,వైద్యులు కనికరింపు చూపలేదని బాధితులు తెలిపారు, చేసేది ఏమీ లేక బాధితులు ఏసిపి కిరణ్ కుమార్ కి రాత్రి ఒంటి గంట సమయంలో ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన ఏసీపీ కిరణ్ కుమార్ బోధన్ టౌన్ ఏఎస్ఐ శ్రీనివాస్ ను .. సిబ్బందిని బోధన్ ప్రభుత్వాసుపత్రికి పంపారు. వెంటనే ఏఎస్ఐ ఏ సి పి కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లి, ఆస్పత్రి సిబ్బంది వైద్యలతో మాట్లాడి ప్రసవ మహిళను ఆ రాత్రి అడ్మిట్ చేశారు. పరిస్థితి విషమించడంతో, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు సక్రమంగా అందించడం, ఆ తర్వాత పండంటి ఆడబిడ్డ పుట్టడంతో ఆ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా మండలి అధ్యక్షురాలు బుడ్డోల సోనీ, ప్రసవ మహిళా కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ.. డెలివరీ కోసం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎంతోమందికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని, ఆ పరిస్థితిలో మళ్లీ తాము ఆటో కట్టుకొని రుద్రూర్ గ్రామానికి తిరుగు ప్రయాణం కాగా పురిటి నొప్పులు రావడంతో, బోధన్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లామన్నారు.
ఆయన చేసిన కృషి వల్ల తమకు రాత్రి అడ్మిట్ చేసుకోవడం జరిగిందని, ట్రీట్మెంట్ అందిందని, అదేవిధంగా నిజాంబాద్ కు పంపించడం జరిగిందని ఆయన కృషి ఫలితం, పండంటి ఆడ శిశువు పుట్టిందని తెలిపారు. ఆయన సేవలు చాలా గొప్పవని వారు కొనియాడడం జరిగింది. నిత్యం శాంతి భద్రతల పర్యవేక్షణలో బిజీగా ఉండే ఏసిపి కిరణ్ కుమార్, రాత్రి ప్రసవ మహిళ ట్రీట్మెంట్ విషయంలో స్పందించడం గర్వకారణం అని ఆయనకు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బోధన్ ఎసిపి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పోలీసు శాఖకు పేరు ప్రతిష్టలు సంపాదించి ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యం ఫ్రెండ్లీ పోలీస్ నెరవేర్చి తీరుతారని బోధన్ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు.