హైదరాబాద్: సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం తెలంగాణా అంతటా నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలతో కలసి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు జె సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.. హైదరాబాద్ నాగోల్‌లోని మూసీ నది తీరంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడడ్డితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ కోటి వృక్షార్చనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మూసీ తీరంలో మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హోంమంత్రి మహమ్మద్ అలీ సంగారెడ్డి జిల్లా జైలు ఆవరణలో మొక్కలు నాటారు. ఖమ్మంలోని సీబీఐటీ కళాశాలలో ఎంపీ నామా నాగేశ్వర రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటి సెల్ఫీ దిగారు. సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి సంపూర్ణ ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్‌గా కోటి వృక్షార్చాన లాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలియజేశారు.
హయత్‌నగర్‌లోని గిరిజన బాలికల గురుకులంలో మంత్రి సత్యవతి రాథోడ్ మొక్కలు నాటారు. గురుకులంలో బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. విద్యార్థినులతో కలిసి కేట్ కట్ చేశారు. అనంతరం వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. భగవంతుడు ఆయనకు మరింత శక్తి ఇవ్వాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, ఆయన నాయకత్వంలో గిరిజనులు మరింత అభివృద్ధిచెందాలన్నారు. కోటి వృక్షార్చన సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖలో 2 లక్షల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బాన్సువాడలో నిర్వహించిన కోటి వృక్షార్చనలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని మాతా శిశు దవాఖానలో మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని జామ తండాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె నిద్ర చేశారు. ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ బానోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి మొక్కలు నాటారు. సిద్దిపేటలో 10 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నర్సాపూర్ చౌరస్తా నుంచి రాజీవ్ రహదారి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా, డివైడర్ మధ్యలో మొక్కలు నాటారు. అనంతరం పట్టంణ పరిధిలోని నర్సాపూర్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించించారు. ఆసరా పింఛన్ లబ్ధిదారులతో కేక్ కట్ చేయించారు.
తెలంగాణ అంతటా కోటి వృక్షార్చనకు శ్రీకారం….
Advertisement
తాజా వార్తలు
Advertisement