Tuesday, November 26, 2024

టి ఆర్ ఎస్ లో ఆప‌రేష‌న్ హుజురాబాద్…

హైదరాబాద్‌, : హుజూరాబాద్‌పై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ తొలగింపు అనంతరం ఆయన టిఆర్‌ఎస్‌ పార్టీకి దూరం కావడం ఖాయం కావడంతో స్థానికంగా పార్టీ బలోపేతంపై నేతలు దృష్టి సారించారు. మంత్రి గంగుల కమలాకర్‌ హుజూరాబాద్‌ ప్రజా పతినిధులపై గురిపెట్టి.. చర్చలు జరుపుతున్నారు. హుజూరాబాద్‌ మునిసిపాలిటీని 11మంది కౌన్సిలర్లను పిలిచి మాట్లాడారు. అభివృద్ది కార్యక్రమాలు, ఇతరత్రా మంజూరుచేయిస్తామని.. హుజూరాబాద్‌, జమ్మికుంట మునిసిపాలిటీలలో పెండింగ్‌ పనులకు సంబంధించిన జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. త్వరలో మంత్రి కేటీఆర్‌, తాను హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం హుజూరా బాద్‌ నియోజకవర్గ నేతలను.. ఈటల రాజేందర్‌ వెంట వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ తాను మాత్రమే బరిలో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రజాప్రతి నిధులను భయపెట్టి లొంగదీసుకున్నా ప్రజలు తనవెంటే ఉంటారని, హుజూరా బాద్‌లో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాలకు అది మలుపవుతుందని రాజేందర్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీల నేతలను కలుస్తూ.. అంతరంగం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనపై సామాజిక మాధ్య మాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆడియో సందేశం విడు దల చేశారు. ఈటల ఒకసారి మాటంటే వెనుకకు పోడని, ఆత్మగౌరవమే తనకు ముఖ్యమన్నారు. కొవిడ్‌ తగ్గగానే తాను రాజీనామా చేస్తానని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement