కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చెప్పేదానికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. బుధవారం ధాన్యం కొనుగోలు విషయంలో
కలిసి మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రప్రభుత్వం నిరాకరిస్తున్నందుకుగాను కరీంనగర్ కలెక్టరేట్‌తోపాటు జిల్లాలోని కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తామన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ధర్నా కొనసాగుతుందని వెల్లడించారు
బండి సంజయ్ వరి వెయ్యాలని చెప్తున్నాడని, కేంద్ర ప్రభుత్వం తాము కొనేది లేదని చెప్తున్నదని విమర్శించారు. పంజాబ్‌లో ధాన్యాన్ని కొంటున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించారు. ఎల్లుండి కేంద్ర మంత్రి ఇంటిముందు బీజేపీ నేతలు ధర్నా చేయాలన్నారు. బియ్యం ఎగుమతి చేసే అధికారం రాష్ట్రానికి లేదన్నారు.