తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పెద్దమనసు చాటుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలను జరపకూడదని అభిమానులను పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. కేకులకు, ఫ్లవర్ బొకేలకు డబ్బులు ఖర్చు చెయకుండా నిరుపేద ప్రజలకు సాయం చేయాలని కోరారు. సమయానికి తిండి దొరకని ఎంతో మందికి ఆహార పదార్థాలు అందించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ పాతబస్తీలోని ఆజంపురాలో మొక్కనాటారు. తెలంగాణను హరితవనంలా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని..దీని కోసం అందరూ కూడా భారీ స్థాయిలో మొక్కలు నాటాలని మహమూద్ అలీ సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement