ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్: రష్యా, చైనా, భారత్‌లపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) కాస్త వెనక అడుగు వేశాడు. ట్రంప్ తాజాగా తన సోషల్ మీడియా(Social media) ‘ట్రూత్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను (US Tariffs) పరిష్కరించడానికి తన స్పెషల్ టీమ్ ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని వెళ్లడించారు. ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలపై తన మిత్రుడైన భారత ప్రధాని నరేంద్ర మోడీ(Indian Prime Minister Narendra Modi)తో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు చర్చలు రెండు గొప్పదేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా ప్రకటించారు.
అయితే, ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ప్రధాన నరేంద్ర మోడీ స్పందించారు. భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్(Close friends) అని చెప్పకొచ్చారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని.. ఇరు దేశాల సంబంధాలు మళ్లీ కొనసాగుతాయని ఆశిస్తున్నానని కామెంట్ చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా, భారత్‌లోని ప్రతినిధులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక తాను కూడా అమెరికా(America) ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని ప్రధాని చెబుతున్నారు.

