జూబ్లీహిల్స్ జోరు పెంచిన టీఆర్ఎస్..

జూబ్లీహిల్స్ జోరు పెంచిన టీఆర్ఎస్

నిజాంపేట, (ఆంధ్రప్రభ)
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కళ్యాణ్ నగర్, వెంచర్3 కాలనీలో బూత్ నెంబర్ 80, 81, 82 లలో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కంట రెడ్డి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని చెరుకు రసం బండి దగ్గర తానే స్వయంగా చెరుకు రసం తీసి షాపు యజమాని యోగక్షేమాలను తెలుసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply