Basara | అమ్మవారి సన్నిధిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
బాసర, ఫిబ్రవరి 11 (ఆంధ్రప్రభ) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని మంగళవారం త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డికి ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆలయ ఆశీర్వచన మండపంలో గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, చైర్మన్ శరత్ పాటక్ శాలువాతో సత్కరించి అమ్మవారి జ్ఞాపికను ప్రసాదాన్ని అందజేశారు. గవర్నర్ కు అమ్మవారి ఆలయ విశిష్టతను వివరించారు.
బ్రహ్మీ తీర్థ ఉత్సవంలో పాల్గొన్న గవర్నర్..
ప్రతి సంవత్సరం మాఘమాసంలో నైమి శరణ్య యాగంలో నిర్వహించే బ్రహ్మీ తీర్థ ఉత్సవంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఈసందర్భంగా నైమిశరణ్య యాగశాల నిర్వాహకులు గవర్నర్ ను ఘనంగా సత్కరించారు.
బీజేపీ కార్యకర్త ఇంట్లో గవర్నర్ అల్పాహారం..
భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మాజీ సర్పంచ్ పి శైలజా సతీశ్వర్ రావు ఇంట్లో త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రాసేనారెడ్డి అల్పాహారం తీసుకున్నారు. ఈసందర్భంగా మండల బీజేపీ నాయకులు గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని ఆత్మీయంగా సత్కరించారు.
