Tributes | నాగాయలంక, ఆంధ్రప్రభ : నాగాయలంకలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఆదివారానికి 126వ రోజుకీ చేరాయి. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగ మల్లికార్జునరావుతో పాటు కూటమి నేతలు(Alliance leaders) పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన ఎంతగానో సేవలు అందించాలని తెలిపారు. అనేకమంది ఉప్పెన(uppena) సమయంలో అనాథలుగా వారికోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు అని కొనియాడారు.
Tributes | 126వ రోజుకి చేరిన ఎంవీకేకి నివాళులు

