Tributes | అమరజీవి పొట్టి శ్రీరాములు

Tributes | అమరజీవి పొట్టి శ్రీరాములు

  • ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు నగునూరి రాజేందర్

Tributes | కరీంనగర్ టవర్ సర్కిల్, ఆంధ్రప్రభ : అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆర్య వైశ్య సంఘం కరీంనగర్ పట్టణ అధ్యక్షులు నగునూరి రాజేందర్ అన్నారు. ఇవాళ‌ కరీంనగర్ పట్టణంలోని టెలిఫోన్ ఆఫీస్ చౌరస్తాలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం స్థానిక ప్రజలకు అల్పాహార వితరణ చేశారు. పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు నగునూరి రాజేందర్ మాట్లాడుతూ.. అమరజీవి పొట్టి శ్రీరాములు స్వాతంత్ర సమరయోధుడుగా, తెలుగు రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి ప్రాణాలర్పించి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప మహనీయులని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో మనందరం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

Tributes

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కన్న కృష్ణ, పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల రమేశం, కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ చిట్టు మల్ల శ్రీనివాస్, ఆవోపా జిల్లా అధ్యక్షులు కొమురవెల్లి వెంకటేశం, మాజీ అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్, ఏవి మల్లికార్జున్, మహాసభ కార్యవర్గ సభ్యులు తోడుపునూరి కరుణాకర్, శివనాతుని శ్రీనివాస్, జిల్లా కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు ఎలగందుల మునిందర్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది వేణు గోపాల్, కోశాధికారి సుద్దాల వెంకటేష్, కొంజర్ల శ్రీకాంత్, అర్బన్ బ్యాంక్ డైరెక్షర్ కన్న సాయి, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు జీడిగే సాయి, మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పబ్బ జ్యోతి, అభ్యుదయ సంఘాల అధ్యక్షులు దొంతుల మనోహర్, పెద్ది శ్రీనివాస్, కొల్లూరి హరిప్రసాద్, రాచమళ్ళ భద్రయ్య, గుడిసె రాజేందర్, కాచం రమేష్, ప్రధాన కార్యదర్శులు రేగురి మారుతి, జిల్లా జగదీష్, ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply