ఎడ్ల మహేందర్ రెడ్డి నివాళి
రామన్నపేట, (ఆంధ్రప్రభ) మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు నకిరేకంటి ఎల్లయ్య గారి తల్లి నకిరేకంటి మల్లమ్మ ( 85 ) అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎడ్ల మహేందర్ రెడ్డి మల్లమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి పిట్టె మహేందర్రెడ్డి,ఉపాధ్యక్షుడు తలారి నరసింహ,సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి,ఎడ్ల కృష్ణారెడ్డి,వార్డ్ సభ్యులు సండ్ల లింగయ్య, నకిరేకంటి నరేష్ కుమార్, జినుక శాంతి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

