అనారోగ్యంతో గిరిజన మహిళ మృతి

జైనూర్, ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గౌరీ కొలం గూడ గ్రామ పంచాయతీకి చెందిన ఆత్రం గుండు బాయి (35) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఆమె బంధువులు కొలం సంఘ నాయకులు అత్రం బాపూరావు, సీడం రాజు తెలిపారు.

గ‌తంలో ఆమెపై కోతి దాడి చేయడంతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సలు పొంది వచ్చింది. చికిత్స చేయించిన నయం కాలేదని కోతి కరిచిన తర్వాత కొద్ది రోజులకు ఆమె అనారోగ్యానికి గురై మధ్య మధ్యలో కోతి లాగా ఎగురుతుండేద‌ని చెప్పారు. మృతురాలకు భర్త ఆనందరావు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో ముగ్గురు మృతి చెందార‌ని వారు పేర్కొన్నారు. వీరికి కూడా ఒళ్లంతా వాపులు (ఉబ్బిపోయి) అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఇటీవల ఒక యువకుడు శరీరమంతా ఉబ్బిపోయి చికిత్సలు చేసిన నయంకాక మృతి చెందినట్లు తెలిపారు. ఒళ్లంతా ఉబ్బి పోవడానికి కారణం తెలియటం లేదని రక్తహీనతన లేక కిడ్నీల ప్రాబ్లమా డాక్టర్లు కూడా సరిగ్గా చెప్పడం లేదని వాపోయారు.