భువనగిరి ఎమ్మెల్యే కుటుంబంలో విషాదం

అనిల్ కుమార్‌రెడ్డి మామ ఆరే ధర్మారెడ్డి మృతి
సూర్యాపేట జిల్లా కందగట్లలో సాయంత్రం అంత్యక్రియలు

వలిగొండ, ఆంధ్రప్రభ: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సతీమణి కిరణ్మయి తండ్రి ఆరే ధర్మారెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

మృతుడు ఆరే ధర్మారెడ్డి స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామంలో గురువారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ధర్మారెడ్డి మృతితో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆరే ధర్మారెడ్డి మృతి పట్ల భువనగిరి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.