Tragedy | తండ్రి కృష్ణాన‌దిలో.. పిల్లలు ఇంటిలో….

విజ‌య‌వాడ – ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విషాదం నెలకొంది.. ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి .. మృతులు హిరణ్య (9), లీలసాయి (7)గా గుర్తించారు.. రెండు నెలల కిందట పిల్లలను తన భర్త రవిశంకర్ వద్ద వదిలి వెళ్లిందట తల్లి చంద్రిక.. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందామని భావించి ఉంటాడని.. తన పిల్లలను ఎవరు పోషిస్తారనే వారిని కూడా హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు..

ఇక, ఆ ఇంట్లో ఓ సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. “నా చావుకు ఎవరు బాధ్యులు కాదని, జీవితంలో ఏమి సాధించలేదని.. అందుకే నా పిల్లలను చంపి నేను చనిపోతున్నానని” లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు రవి శంకర్‌.. అయితే, గురువారం ఇంటికి వచ్చిన రవిశంకర్ తండ్రి తలుపులు తెరిచి చూడగా, మంచంపై విగత జీవులుగా కనిపించారు చిన్నారులు.. దీంతో, తన కుమారుడు ఏమయ్యాడు అనే ఆందోళన ఆయనలో మొదలుకావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రవిశంకర్ ఫోన్ కాల్ సిగ్నల్ చివరగా ఇబ్రహీం పట్నం ఫెర్రీ దగ్గర కృష్ణా నది దగ్గర గుర్తించారు పోలీసులు.. దీంతో, నదిలో దూకి రవిశంకర్ ప్రాణాలు తీసుకుని ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు.. ఇంట్లోనే ఇద్దరు పిల్లను హత్య చేసిన రవి శంకర్‌.. ఆ తర్వాత కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెబుతున్నారు..

Leave a Reply