నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ వద్ద విషాదం
నెల్లూరు, ఆంధ్రప్రభ : నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. బీచ్‌లో సరదాగా ఈతకొడుతుండగా ముగ్గురు యువకులు… మునిగిపోయారు. వారిని గుర్తించిన స్థానికులు, మెరైన్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే వారు మృతిచెందగా, మృతులు నారాయణరెడ్డిపేటకు చెందిన వారిగా గుర్తించారు.

