Trafic Police | యువకుల అరెస్ట్
విధులకు ఆటంకం కలిగించారని..
Trafic Police | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నం ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా స్థానిక మచిలీపట్నానికి చెందిన ముగ్గురు యువకులు తప్ప తాగి ట్రాఫిక్ సీఐ రాజు, వారి సిబ్బందిపై తిరుగబడి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో కేసు నమోదు చేసిన ఇరుగుదురు పేట పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. యువత మాదకద్రవ్యాల వలలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, చెడు స్నేహాలకు చేసి జీవితాలు పాడు చేసుకోవద్దని సీఐ పరమేశ్వర రావు యువతకు హెచ్చరించారు.

