Friday, November 22, 2024

Zika virus: యూపీని వెంటాడుతున్న జికా.. 100 దాటిన కేసులు

ఉత్తర్ ప్రదేశ్ లో జికా కలకలం రేపుతోంది. రోజు రోజుకు వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే వైరస్ బాధితుల సంఖ్య 100 దాటింది. ఓవైపు కరోనా కేసులు అదుపులోకి వస్తుంటే… మరోవైపు పెరుగుతున్న జికా వైరస్ కేసులు ఆందోళనకర పరిస్థితిని కలిగిస్తున్నాయి. కాన్పూర్ లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఉత్తర్ ప్రదేశ్ లో 106 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒకే రోజు 16 మందికి జికా వైరస్ సోకింది. దీంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.

జికా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి రక్షణ చర్యలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో కాన్పూర్ లో పారిశుద్ద్య పనులు వేగవంతం చేశారు. జికా వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి  15 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి: తక్షణమే ధాన్యాన్ని కొనండి: తెలంగాణలో బీజేపీ నిరసనలు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement