ఓ యువకుడు లోకల్ ట్రైన్ డోర్ కి వేలాడుతూ ప్రయాణించాడు. తనతో పాటు మరో ముగ్గురు యువకులు కూడా ఉన్నారు. కాగా ట్రైన్ మూవ్ అవుతుండగానే… డోర్‌లో నిలబడ్డ మధ్యలో ఉన్న యువకుడు ట్రైన్ పక్కనే ఉన్న ఓ పోల్‌కు ఢీకొన్నాడు. దీంతో ఆ యువకుడు తనపై నియంత్రణ కోల్పోయాడు. బ్యాలెన్స్ కోల్పోవడంతో ట్రైన్ డోర్ నుంచి నేరుగా పట్టాలపై పడిపోయాడు. ఈ ఘటన కాల్వా, థానే స్టేషన్‌ల మధ్య జరిగింది. బాధితుడిని దానిష్ జాకిర్ హుస్సేన్ ఖాన్‌గా గుర్తించారు. కాల్వా మురికివాడకు చెందినవాడిగా తెలిసింది. లేబర్‌గా పని చేస్తున్నాడు.దానిష్ జాకిర్ హుస్సేన్ ఖాన్ ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి ట్రాక్‌పై పడినట్టు ఆయన బంధువులు, ఇతరులు కొందరు ఆయనను కాపాడటానికి పరుగున వెళ్లారు.
దానిష్‌ను కాల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఆ యువకుడికి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్టు వివరించారు. అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలకేమీ ముప్పు లేదు. థానే రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో లోకల్ ట్రైన్‌లు చాలా ఫేమస్. స్థానికులు చాలా మంది లోకల్ ట్రైన్‌లలోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ లోకల్ ట్రైన్‌లలోనే కొందరు యువకులు ప్రమాదకరమైన రీతిలో ప్రయాణాలు చేస్తుంటారు.