పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ పై దాడులు జరిగే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆయనకు భద్రత కల్పించనున్నారు. కేరళ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆనంద బోస్ గతేడాది నవంబర్ 23న బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయనపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని ఐబీ వర్గాలు నివేదిక ఇవ్వడంతో కేంద్ర హోంశాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement