Saturday, November 23, 2024

జెడ్ కేట‌గిరి వ‌ద్దు – బైకే ముద్దు

జెడ్ కేట‌గిరిని కాద‌ని బైక్ బెస్ట్ అంటున్నారు ఎంఐఎం అధ్య‌క్షుడు, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ. రీసెంట్ గా ఆయ‌న‌పై కాల్పులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దాంతో కేంద్ర ప్ర‌భుత్వం జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ని క‌ల్పించింది. కానీ త‌న‌కి భ‌ద్ర‌త అవ‌స‌రం లేద‌న్నారాయ‌న‌. దాంతో ఆయ‌న వార్త‌ల్లో నిలిచారు. ఆయ‌న తండ్రిని గుర్తు చేసుకుంటున్నారు ఓల్డ్ సిటీ ప్ర‌జ‌లు. 1980వ స‌మ‌యంలో అస‌దుద్దీన్ తండ్రి సుల్తాన్ స‌లా వుద్దీన్ ఒవైసీ కూడా ఒంట‌రిగా బైక్ పైనే తిరిగేవార‌ట‌. కాగా భద్రతా కారణాల దృష్ట్యా ఆయన తర్వాతి కాలంలో సెక్యూరిటీని ఏర్ప‌రుచుకున్నారాయ‌న‌. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బైక్ పై వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు.

నన్ను ఎవరు చంపుతారో చంపనివ్వండి. నేను మాత్రం ఇలా ఒంటరిగానే వెళ్తాన‌ని అస‌దుద్దీన్ ఒవైసీ తాజా కాల్పుల ఘటన తర్వాత కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం. 1994లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి.. ప్రభుత్వం భద్రత కల్పించినా ఆయన తీసుకోలేదు. నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచినా.. ఆయన తిరస్కరించేవారని ఒక ఎంఐఎం నేత తెలిపారు. కాగా ప్రభుత్వ భద్రత లేకపోయినా.. ఆయన వెనుకే కొందరు బైకులపై రక్షణగా వెళ్తుంటారు. తన తమ్ముడు అక్బరుద్దీన్ పై దాడి జరిగిన సమయంలోనూ ఆయన భద్రత వద్దన్నారు. దాడికి ముందు అక్బరుద్దీన్ కూడా ఎప్పుడూ భద్రత లేకుండానే వెళ్లేవారు. ప్రస్తుతం బుల్లెట్ కారుతో పాటు ప్రభుత్వం భద్రతను కల్పించిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement