ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే,సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి పదవి కాలం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే.
మరోవైపు కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవుల రద్దు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్.. ఎవరికీ కూడా కార్పొరేసన్, చైర్మన్ పదవులకు అవకాశం ఇవ్వలేదు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కోర్పారేషన్ చైర్మన్ పదవుల్లో భారీగా కేటాయింపులు జరిపారు.