Thursday, October 17, 2024

బిజెపిలో విలీన‌మ‌యిన ‘యువ తెలంగాణ’ పార్టీ

యువ తెలంగాణ పార్టీ , బిజెపి పార్టీలోకి విలీన‌మ‌యింది. ఈ యువ తెలంగాన పార్టీని స్థాపించిన బాల‌కృష్ణా రెడ్డి తెలంగాణ‌ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విష‌యం తెలిసిందే. తమ పార్టీలో విలీనం కావాలంటూ ఆయ‌న‌కు కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఆఫ‌ర్‌లు వ‌చ్చాయి. చివ‌ర‌కు ఆయ‌న త‌న పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణీ రుద్రమ నేడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆధ్వ‌ర్యంలో న్యూఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement