Sunday, November 24, 2024

YSRCP – ల‌క్ష గ‌డ‌ప‌ల వైపు వ‌డి వ‌డిగా…….

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ప్రతి గడపకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టిన గడప గడపకు మన ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోం ది. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకు ని అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు పథకాలు అందని నిజమైన లబ్ధిదారులకు ఆ ఫలాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యేకిం చి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం జగన్‌ కొన్ని లక్ష్యాలను కూడా దిశానిర్దేశం చేశారు. అందు లో భాగంగానే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యులు, మాజీమంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి లక్ష గడపల లక్ష్యాన్ని పూర్తి చేయబోతున్నారు. ఆదివారం లక్ష గడపలకు వెళ్లిన శాసనసభ్యుడిగా ఆయన సరికొత్త రికార్డ్‌ సృష్టించబోతున్నారు. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మంత్రులు, శాసనసభ్యులు అత్యధిక మంది 70 వేల నుంచి 90 వేల గడపల లక్ష్యానికి చేరువలో ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవశాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి 90 వేలకు పైగా గడపలను ఇప్పటికే పూర్తి చేశారు.

అయితే మాజీమంత్రి ప్రసన్న కుమార్‌ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో లక్షా 7 వేల గడపలు ఉండగా ఇప్పటికే లక్ష గడపల లక్ష్యానికి చేరుకున్నారు. మరో 20 – 30 రోజుల్లో ఆ 7 వేల గడపలను కూడా పూర్తి చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రసన్న కుమార్‌ రెడ్డి రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఆయన ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కారం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల్లో కూడా మరింత అవగాహన కల్పిస్తున్నారు. మొత్తానికి గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం దిశగా లక్ష గడపల దిశగా రాష్ట్రంలో సాగుతోంది. ఎమ్మెల్యేల్లో కూడా మరింత పట్టుదల, లక్ష్యం పెరిగింది. ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుం డటంతో ప్రతి ఒక్కరు ప్రజల్లోనే ఉంటూ ప్రతి గడపకు వెళ్తున్నారు. దీంతో సీఎం జగన్‌ ఆశయం విజయవంతం కాబోతోంది.

లక్ష్యానికి చేరువగా అడుగులు..
రాష్ట్రంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు సీఎం జగన్‌ ఆరుసార్లు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన వర్క్‌ షాపులో 32 మంది ఎమ్మెల్యేలు వెనుకబడి చిన్నట్లు-గా గుర్తించారు. కార్యక్రమం ఆరంభంలో 75 మంది ఎమ్మెల్యేలకు పైగా ప్రజలకు దూరంగా ఉన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పెరిగేకొద్దీ ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే వెనుకబడిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ శాతం మంది తమ గ్రాఫు పెంచుకోగలిగారు. మొత్తంగా సీఎం జగన్‌ సమీక్షలు చేసే కొద్దీ ఎమ్మెల్యేల పనితీరులో క్రమేణా మార్పు కనిపిస్తూ వస్తుంది. ఆగస్టు చివరి వారంలో మరోసారి వర్క్‌షాప్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు మిగిలిన ఎమ్మెల్యేల పనితీరులో కూడా మార్చు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో 100 రోజులు పూర్తి అయితే చాలు అనుకునే ఆలోచన నుంచి ఎమ్మెల్యేలంతా నియోజకవర్గ పరిధిలోని ప్రతి గడప తొక్కాలనే లక్ష్యానికి వచ్చారు. ఫలితంగా గడపలో వేగం పెరిగింది. ఎమ్మెల్యేలు లక్ష గడపల లక్ష్యాన్ని కూడా దగ్గర రాబోతున్నారు. మొత్తం మీద సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తికాబోతుంది.

ఎమ్మెల్యేలకు పెరిగిన మైలేజ్‌..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు గత ఏడాది మే 11వ తేదీ నుంచి రాష్ట్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు పై కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మొదట్లో కొంతమంది గడప గడపపై ఆసక్తి చూపలేదు. సీఎం జగన్‌ సమీక్షలు, సర్వే నివేదికలు ఆయా ఎమ్మెల్యేల్లో పట్టుదలను, చైతన్యాన్ని నింపాయి. దీంతో రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు పోటీపడి గడప గడపకు వెళ్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఎమ్మెల్యేల మధ్య గడప గడప కార్యక్రమం గట్టి పోటీనిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీలో కొత్త జోష్‌, జోరును నింపుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి మొదటి నుంచి సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా నెలలో 25 రోజులకు పైగా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రతి గడపకు వెళ్తున్నారు. ఫలితంగానే ఇతర జిల్లాలతో పోలిస్తే వైసీపీకి కంచుకోటగా ఉన్న సింహపురిలోని కోవూరులో లక్ష గడపల లక్ష్యం పూర్తి కాబోతోంది. ప్రసన్న కూడా సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ నియోజకవర్గంలో వైసీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇదే తరహాలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా దూకుడుగా వెళ్తున్నారు. మొత్తంమీద గతంతో పోలిస్తే గడప గడపకు మన ప్రభుత్వంతో ఎమ్మెల్యేల్లో మైలేజ్‌ మరింత పెరిగింది. రాజకీయ విశ్లేషకుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement