Wednesday, November 20, 2024

పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరు: షర్మిల

తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖ‌ర్‌ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్‌ తెలంగాణకు మంచి చేశారా..ద్రోహం చేశారా..గ్రామాలకు వెళ్లి అడగాలని అన్నారు. వైఎస్‌ చనిపోయాకే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని షర్మిల గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేసిన షర్మిల…యూపీఏ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చారని తెలిపారు. తన తండ్రి ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజల కోసం నిలబడే.. పోరాడే పార్టీ వైఎస్సార్‌ టీపీ అని స్పష్టం చేశారు.  

పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరని షర్మిల వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్​ మీద అలిగితే.. మాట్లాడ్డం మానేస్తాను కానీ పార్టీ పెట్టనని అన్నారు. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోందన్న షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే ధ్యేయంగా పార్టీ పెట్టినట్లు తెలిపారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఈ పార్టీ స్థాపించామన్నారు. కృష్ణా జలాల అంశాలను కేసీఆర్‌ ఏనాడైనా సీరియస్‌గా తీసుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును వదులుకోమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో ఎంత మంది మహిళలున్నారని.. మీటింగ్‌ జరిగితే మహిళా సర్పంచ్‌కు కూడా కుర్చీ ఇవ్వరని విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలని, వ్రతాలు చేసుకోవాలి షర్మిల అన్నారు. నిరుద్యోగుల కోసం తాను వ్రతమే చేస్తున్నానని అన్నారు

ఇది కూడా చదవండి: వాట్.. కేటీఆర్ ను కూడా సంతోష్ సైడ్ చేస్తున్నాడా?!

Advertisement

తాజా వార్తలు

Advertisement