ఏపీ పురపాలక ఎన్నికల్లో అధికార వైసీపీ తన హవా ఏంటో మరోసారి చూపించింది. మొత్తం 75 మున్సిపాలిటీలకు 74 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 11 కార్పొరేషన్లలో విజయం సాధించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌ను హైకోర్టు ఉత్తర్వుల వల్ల నిలిపివేశారు. మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ 12, వైసీపీ 11 వార్డుల్లో గెలవగా.. ఎక్స్ అఫీషియో ఓటుతో వైసీపీ అభ్యర్థి ఛైర్పర్సన్ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement