Friday, November 22, 2024

Exclusive | షర్మిల చేరికపై వీడిన సస్పెన్స్​.. జులై 8న ముహూర్తం?!

వైఎస్సార్​ తెలంగాణ పార్టీ (వైఎస్సార్​టీపీ) అధినేత్రి షర్మిల కాంగ్రెస్​ పార్టీలో చేరడంపై సస్పెన్స్ వీడింది. దివంగత నేత వైఎస్​ రాజశేఖరరెడ్డి 74వ జయంతి (జూలై 8న) రోజు ఆమె కాంగ్రెస్​లో చేరుతుందని సమాచారం అందుతోంది. తెలంగాణ కాంగ్రెస్​లో స్థానం కోసం ఆమె ట్రై చేస్తుండగా.. ఏపీ కాంగ్రెస్​లో చేరితే బాగుంటుందని కొంతమంది లీడర్లు అనడం వివాదాలకు తావిచ్చింది. అయితే.. ఎట్టకేలకు ఆమె చేరిక విషయంలో కొంత క్లారిటీ వచ్చినట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తెలంగాణలోనే షర్మిల పోటీ చేయనున్నట్టు కూడా ఊహాగానాలునప్పటికీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచి క్లారిటీ రాలేదు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వైఎస్ఆర్టీపీ వర్గాల సమాచారం ప్రకారం.. షర్మిల చేరికపై ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదని తెలిసింది. కొన్ని వారాలుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆమెతో టచ్‌లో ఉన్నారని చెబుతుండగా, వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదని తెలుస్తోంది. వాస్తవానికి గత నెలలో తాను ఏపీ కాంగ్రెస్‌లో చేరతానని, పార్టీ అధినేత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని మీడియాలో వచ్చిన వార్తలను షర్మిల ఖండించారు.

2019 సాధారణ ఎన్నికల తర్వాత AP సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదాలు తలెత్తాయని, దీంతో ఆమె తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేశారనే విషయం చాలామంది నుంచి వినిపిస్తోంది.  కాగా, 2011లో కాంగ్రెస్‌ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి)ని ప్రారంభించిన జగన్, రాష్ట్ర ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 151 స్థానాల్లో అఖండ మెజారిటీతో గెలుపొందారు. అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ (టిడిపి)కి ఘోర పరాజయాన్ని అందించారు.

- Advertisement -

ఇదంతా ఇలా ఉండగా.. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రారంభించడం, వైఎస్ఆర్ కుమార్తె కావడం వల్ల ఆమెకు కచ్చితంగా ఆదరణ ఉంటుందని చాలామంది భావించారు. అంతేకాకుండా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కూడా ఆమెను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే.. రాబోయే ఎన్నికల దృష్ట్యా షర్మిల కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేయడం, తెలంగాణలో జరిపితన పాదయాత్ర క్రమంలో సీఎం కేసీఆర్​ను తిట్టడం, లోకల్​ ఎమ్మెల్యేలను అనరాని మాటలనడం కాస్త వివాదాస్పదంగా మారింది. 

అంతేకాకుండా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కూడా షర్మిలకు తెలంగాణ యూనిట్‌లో స్థానం లేదని పరోక్షంగా చెప్పారు. ఆమె ఏపీ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆంధ్రాకు చెందిన ఏ ఒక్కరికీ ఇక్కడ స్థానం కల్పించలేమని ఆయన స్పష్టంగా చెప్పడం తెలిసిందే.

తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటికీ వైఎస్ఆర్ పేరును వాడుకుంటోంది, ఇక.. నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి రెడ్డి లీడర్ల ప్రభావం ఉన్న చోట రాజశేఖరరెడ్డి పేరు వాడుకోవడం ఎంతో ఉపయోగకరం అంటున్నారు నేతలు.  కాగా, షర్మిలను తీసుకోవడం కాంగ్రెస్‌కు సానుకూలాంశం అయితే.. రేవంత్ మాత్రం తనదైన ముద్ర కనిపించాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ వారసత్వాన్ని ఆయన అంగీకరించలేరు అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రాజకీయ పరిశీలకుడు తెలిపారు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement