తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ కొత్త పార్టీ స్థాపించబోతున్న వైఎస్ షర్మిల.. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. బుధవారం నల్గోండ జిల్లా హుజూర్‌నగర్ లో పర్యటించాల్సి ఉంది. నిరుద్యోగంతో ఆత్మహత్యాయత్నం చేసిన నీలకంఠసాయి అనే యువకుడిని ఆమె పరామర్శించాల్సి ఉంది. అయితే, ఇక్కడే ఉహించని పరిణామం చోటుచేసుకుంది.
మేడారం గ్రామంలో ఇంటికి తాళం వేసి నీలకంఠ సాయి కుటుంబం బయటకు వెళ్లిపోయింది. యువకుడి ఇంటికి షర్మిల చేరుకుంటుంది అనుకునేలోపు అతడి ఆచూకీ మిస్ అయ్యింది. షర్మిల పరామర్మకు వస్తుందని నీలకంఠసాయిని కిడ్నాప్ చేశారని షర్మిల అనుచరులు ఆరోపిస్తున్నారు. తాళం వేసిన నీలకంఠ ఇంటి ముందే నిరుద్యోగులతో షర్మిల ముఖాముఖి నిర్వహించారు. కాగా, తెలంగాణలో జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వైయస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. పార్టీ సంస్ధాగత నిర్మాణం కోసం జిల్లాల వారీగా అడహక్ కమిటీలను కూడా నియమించిన సంగతి తెలిసిందే.