Saturday, November 23, 2024

3 రోజుల దీక్షకు షర్మిల రెడీ.. కానీ..

తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిల….ఇక ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో భాగంగా నిరుద్యోగుల సమస్యల తరఫున పోరాటానికి దిగారు. నిరుద్యోగుల కోసం ఆమె నిరాహార దీక్షకు రెడీ అయ్యారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద షర్మిల నిరాహార దీక్ష చేయానున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ఆందోళనలు చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రేపటి(ఏప్రిల్ 15) నుంచి మూడు రోజులపాటు నిరాహార దీక్షకు దిగుతున్నట్లు షర్మిల ప్రకటించారు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే వరకు దీక్షలు ఆగవని స్పష్టం చేశారు.

మరోవైపు షర్మిల నిరాహార దీక్షకు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 10 నుంచి 5 వరకు మాత్రమే పోలీసులు ఇందిరా పార్క్‌లో దీక్షకు అనుమతి ఇచ్చారు. అయినా షర్మిల మాత్రం తాను మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. షర్మిల మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తారా ? లేదంటే ఒక్కరోజు మాత్రమే చేస్తారా? అన్నది చూడాలి.

కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాబోయే జయంతి జులై 8న కొత్త పార్టీని ఆవిష్కరించనున్నట్లు ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగిన సభలో వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే రోజున పార్టీ పేరును, జెండా, అజెండాను ప్రకటిస్తానని షర్మిల వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement