Tuesday, September 17, 2024

YS Sharmila: నేటి నుంచి ‘రైతు ఆవేదన యాత్ర’కు శ్రీకారం

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నేటి నుంచి ‘రైతు ఆవేదన యాత్ర’ చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం నుంచి జిల్లాల్లో రైతు ఆవేదన యాత్రలు చేయనున్నారు. యాత్రలో భాగంగా మొదటి రోజు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గం కంచనపల్లిలో రైతులు శ్రీకాంత్‌, మహేష్‌ కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అనంతరం లింగంపల్లిలో షేకులు అనే రైతు కుటుంబాన్ని కలిసి ఓదార్చనున్నారు. ఉదయం 10.30గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది.

రైతన్నకు అండగా నిలిచేందుకు.. నిరంకుశ ప్రభుత్వ ఆగడాలను ఎండగట్టేందుకు ’’రైతు ఆవేదన యాత్ర‘‘కు  శ్రీకారం చుడుతున్నట్లు వైఎస్ఆర్టీపీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement