Saturday, November 23, 2024

నిరుద్యోగులకు అండగా వైఎస్ఆర్టీపీ.. ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పోరు

నిరుద్యోగులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నిరుద్యోగులకు మద్దతుగా వనపర్తి జిల్లా తాడిపర్తిలో వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 50 వేల ఉద్యోగాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు అండగా నిలబడతానని చెప్పారు. తాడిపర్తిలో రోజంతా నిరాహార దీక్ష చేయనున్నట్లు షర్మిల వెల్లడించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపేందుకు వారికి భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా వైఎస్సార్​టీపీ ప్రకటిస్తుందని చెప్పారు. నిరుద్యోగులకు అండగా తాము నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు. ఎవరు చచ్చినా.. నాకేంటి అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: హుజూరాబాద్‌లోనూ దుబ్బాక సీన్ రిపీట్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

Advertisement

తాజా వార్తలు

Advertisement