మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చర్చకు కారణమైంది. సదరు ట్వీట్లో కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన షర్మిల.. తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను కేటీఆర్‌కు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ట్వీట్‌పై కేటీఆర్ అభిమానులు తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ ఆదివారం నాడు షర్మిల ఆరోపించారు.
తాజా ట్వీట్లో ‘గళమెత్తిన శ్రీకాంత్ లాంటి యువకుల ఆత్మహత్యలు ఆపడం కోసమే మా పోరాటం. చిన్న దొరగారు మొదట ఆడవాళ్లు వ్రతాలే చేసుకోవాలన్నారు. నిన్నటి పుట్టినరోజు శుభాకాంక్షలకు ఉలిక్కిపడి లేచి నిరుద్యోగుల సమస్యలపైన మా పోరాటానికి మరింత ఆదరణ తీసుకొచ్చినందుకు కేటీఆర్ గారి సైన్యానికి ధన్యవాదాలు’ అని షర్మిల చురకలంటించారు.
‘మీ వ్యక్తిగత దూషణతో మా పోరాట స్ఫూర్తిని మరింత పెంచారు. మా కన్నా మేము ఎంచుకున్న పోరాటం గొప్పది. మీరు మమ్మల్ని అణచివేయాలని ఎంత గింజుకున్నా యువతకు ఉద్యోగాలిప్పించే వరకు మా పోరు సాగుతూనే ఉంటుంది. అంతవరకు మీకు ప్రతిరోజు మీ చేతగానితనాన్ని గుర్తుచేస్తూనే ఉంటాం’ అని షర్మిల ట్వీట్లు చేశారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు గతంలో పాడిన ఓ పాటను షర్మిల పోస్ట్ చేశారు.
ఈ వార్త కూడా చదవండి: జగన్ లూటీలపై సీబీఐ చేసింది చాలా తక్కువ