వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్ ధర్నాపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. మూడు గంటల ధర్నా చేసి.. రైతు చట్టాలను రద్దు చేపించామని జబ్బలు చర్చుకొంటున్నారని విమర్శించారు.‘కేసీఆర్…మీరు అంత మొనగాళ్ళయితే 6 గంటలు ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చెయ్యండి.. మంచి జరిగితే మీ ఎకౌంట్లో.. లేకుంటే పక్కోని మీద బట్టకాల్చి మీదేయడం మీకు అలవాటేగా’ అంటూ షర్మిల విమర్శలు చేశారు.
‘ఉత్తుత్తి ఎన్నికల హామీలు ఇచ్చినట్టు, ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మసిపూసి మారేడు కాయ చేయాలని, మోసం చేయాలని చూస్తే వదిలిపెట్టం. సెంటర్లు పెట్టడం కాదు.. ముందు కాంటాలు పెట్టి .. రైతుల ధాన్యం వర్షం పాలు కాకముందే కొనాలని డిమాండ్ చేస్తున్నాం’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital