తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీచర్ నుండి డాక్టర్ దాక అందరిని కాంట్రాక్ట్ పెట్టుకొంటే, సీఎం పదవి కూడా కాంట్రాక్ట్ పెట్టుకొంటే సరిపోదా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ పదమే ఉండదని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మీ పరిపాలన అంత కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితోనే నడిపిస్తున్నారు కదా? అని అన్నారు. ఏండ్ల తరబడి నోటిఫికేషన్స్ ఇచ్చింది లేదని మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులతో చాకిరి చేయించుకొంటూ చాలీచాలని జీతాలతో వారి శ్రమ దోచుకొంటూ మరోవైపు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు చనిపోయేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలే కాకుండా అవుట్ సోర్సింగ్ ఖాళీలను కూడా రెగ్యులర్ గా భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement