Wednesday, November 20, 2024

హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ గజినీ అవుతారు: షర్మిల

కేసీఆర్ ఇలాకాలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ గజినీ అయిపోతారని షర్మిల ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయాలని, వారికి అన్ని విధాలుగా తమ పార్టీ అండగా ఉంటుందని షర్మిల భరోసా ఇచ్చారు.

మరోవైపు సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు గత ఏడేళ్లుగా కేసీఆర్ ఏం చేశాడని షర్మిల ప్రశ్నించారు. తాలిబన్‌ల చేతుల్లో ఆప్ఘనిస్తాన్ ప్రజలు చిక్కుకుపోయినట్లు.. కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో తెలంగాణ ప్రజలు చిక్కుకుపోయారని షర్మిల వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత దళితులపై 800 శాతం దాడులు పెరిగాయని.. 37 లక్షల మంది రైతులకు వాగ్దానం చేసి 3 లక్షలు మందికి మాత్రమే రుణమాఫీ చేశారని మండిపడ్డారు. 54 లక్షలు మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని.. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని తెలిపారు. నిరుద్యోగులవి ఆత్మహత్యలు కాదని… ప్రభుత్వ హత్యలని షర్మిల విమర్శలు చేశారు.

ఈ వార్త కూడా చదవండి: విద్యాసంస్థల్లో చర్యలు సక్రమంగా అమలవుతాయా?

Advertisement

తాజా వార్తలు

Advertisement