Saturday, November 23, 2024

YS Sharmila: సీఎం పదవికి కేసీఆర్ అనర్హుడు.. రైతుల పాలిట యముడు

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా మూడో రోజు రాజ‌న్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ‌లం అక్క‌ప‌ల్లిలో పంట కొనుగోళ్ల‌లో జాప్యం,అప్పుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు మ‌ల్ల‌య్య కుటుంబాన్ని పరామ‌ర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఏఒక్క నాయకుడూ ఆదుకోలేదని షర్మిల మండిపడ్డారు. రైతుల పాలిట యముడిలా KCR తయారయ్యారని వ్యాఖ్యానించారు.

కేసీఆర్, కేటీఆర్ ఇలాఖాల్లో రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇక్కడికి రాకుండా గ్రామస్తులను బెదిరించే హక్కు కేటీఆర్ కు ఎక్కడిది? అని ప్రశ్నించారు. మీ సత్తాలేని పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఇంగితం ఉంటే రైతులను ఆదుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేని, మంత్రిని, కాబోయే సీఎంనని చెప్పుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు.

బోర్లు వేసుకున్న రైతులకు దివంగత సీఎం వైయస్ఆర్ ఎంతో చేశారని గుర్తు చేశారు. పదవుల్లో ఉన్న తండ్రీకొడుకులు ఏం చేశారని ప్రశ్నించారు. రైతుబంధు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి… విత్తనాలు, సబ్సిడీలు, యంత్రలక్ష్మి, నష్టపరిహారాలను బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన రైతు కుటుంబాలకు కూడా పెన్షన్ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం ఇదని విమర్శించారు.

కేసీఆర్ రైతు ద్రోహి అని, రైతుల మరణాలకు ఆయనే కారణమని షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ అనర్హుడని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలన చేతకాక గల్లీల్లో దర్నాలు, ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చావు డప్పు కొట్టాల్సింది కేసీఆర్ ప్రభుత్వానికేనని షర్మిల పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement