Tuesday, November 19, 2024

షర్మిల పార్టీ అధికార ప్రతినిధులు వీరే!

తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైఎస్‌ఆర్‌టీపీ) ఖరారైన సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం ఈ గుర్తింపునిచ్చింది. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుకా రాజగోపాల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా వైఎస్సార్‌టీపీకి అధికార ప్రతినిధులను వైఎస్ షర్మిల నియమించారు.

మొత్తం 9 మందితో కూడిన తొలి అధికార ప్రతినిధుల జాబితా విడుదల చేశారు. అధికార ప్రతినిధులుగా కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరా శోభన్, తూడి దేవేందర్‌ రెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్జబ్‌, మతిన్ ముజాదద్ది, భూంరెడ్డి, బీశ్వ రవీందర్‌లను అధికార ప్రతినిధులుగా నియామించారు. 

మరోవైపు షర్మిల పక్క వ్యూహంలో రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు.  గతంలో ప్రకటించిన ప్రణాళికను అమలు చేసేలా అడుగులు వేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. కొన్ని ఆటంకాలు వచ్చినా.. పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ ఏర్పాటు ను ప్రకటించి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆమె పార్టీ పేరును, జెండాను, సిద్ధాంతాన్ని ప్రకటించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగం, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం,  ధాన్యం కొనుగోలు  తదితర అంశాలపై కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement