Friday, November 22, 2024

కేసీఆర్ నీది గుండెనా బండనా?: షర్మిల

వైఎస్ షర్మిల తెలంగాణలో నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర ఆమె దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో షర్మిల అధికార పార్టీపై విమర్శలు గుప్పించింది. తెలంగాణలో 40 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం చూస్తున్నారని..మరెందుకు కేసీఆర్ నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు వేయడం లేదని ప్రశ్నించారు. ఇటీవల కేయూలో సునీల్ నాయక్, మహేందర్ యాదవ్ నల్లగొండకు చెందిన సంతోష్ కుమార్ ఉరి వేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా.. దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్ పరిస్థితి ఉందిని విమర్శించారు. ఆయన పాలనలోనే ఇంతమంది యువకులు చనిపోతుంటే కేసీఆర్ కి కన్పించడం లేదా..? అంటూ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్.. నీ ఛాతీలో ఉన్నది.. గుండెనా.. బండనా..! ఈ పరిస్థితి మారాలి అని అన్నారు. అంతేకాదు, తెలంగాణ యువతకు ఉద్యోగాల కోసం 72 గంటలు దీక్ష కొనసాగిస్తా. 4 వ రోజు నుంచి జిల్లాల వారీగా ర్యాలీలు చేపడతాం అంటూ కేసీఆర్ సర్కారుకి ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.

Advertisement

తాజా వార్తలు

Advertisement