తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతున్న వైఎస్ షర్మిల.. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల ముఖ్య నాయకులతో ఇవాళ సమావేశం అవుతున్నారు. ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం- బహిరంగసభ ఏర్పాట్లపై చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ సమావేశం జరుగుతోంది.
ఏప్రిల్ 9న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభను వైఎస్ షర్మిల నిర్వహించనున్నారు. ఈ సభకు ఇప్పటికే పోలీసుల అనుమతి లభించింది. ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఖమ్మం నగర రెండో పట్టణ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించే సభ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని తెలిపారు. అయితే, సభలో పాల్గొనేలా పూర్తిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఆంక్షలు విధించారు.
ఖమ్మం బహిరంగ సభ వేదిక నుంచే పార్టీ ప్రకటన, విధి విధానాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనుండటం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకోనుంది. రాజన్న రాజమ్యే లక్షమంటున్న షర్మిల పార్టీపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి.