Saturday, November 23, 2024

YS Sharmila: చనిపోయిన రైతులు ఎందరు ? ప్రభుత్వ పరిహారం ఎందరికి?

రైతులకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పరిహారంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. చనిపోయిన రైతులు ఎందరు ? మీరు ఇచ్చే పరిహారం ఎందరికి? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటివరకు దాదాపు 7600 మంది రైతులు చనిపోతే.. 1600 మందికి పరిహారం ఇస్తే సరిపోతుందా? అని నిలదీశారు. పరిహారం రాని మిగతా 6000 మంది పరిస్థితి ఏంటి? అని ఆమె ప్రశ్నించారు. చావుల్లో కూడా తేడాలా ? అని మండిపడ్డారు. ఆ రైతు ఆత్మహత్యలన్నిటికి కారణం మీరు కాదా ? పాప ప్రక్షాళన కూడా సరిగా చేసుకోలేరా ? అని నిలదీశారు.

ముఖ్యమంత్రికి,మంత్రులకు,ఎమ్మెల్యేలకు జీతాలు ఆగిందిలేదని, కాని రైతులు చనిపోతే ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి ఏండ్ల తరబడి ఆగాలి, ఎందుకు? అని షర్మిల అడిగారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనా? రైతుల చావులంటే పట్టింపు లేదా? అడిగే వారు లేరనా? ఇచ్చే పరిహారమే ఎక్కువ ఇంకా పట్టించుకునేది ఏంది అని అహంకారామా? అని షర్మిల ధ్వజమెత్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement