మీ గుండెలు రాతి బండలు అంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. కేసీఆర్ కి హృదయమే లేదనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ఇండ్లు బంగారు వాసాలు చేస్తానన్న దొర .. రైతులు అదే వాసాలకు ఉరివేసుకొంటుంటే…. ఆదుకోవడం చేతకాని దొరగారికి రాజకీయ డ్రామాల కోసం ఉత్తరాది రైతులకు డబ్బులు ఇవ్వడానికి చేతనౌతుందని చురకలు అంటించారు.ఇక్కడి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకొంటుంటే .. నోటిఫికేషన్స్ ఇవ్వడం చేతకాని దొరకు… తన కుటుంబానికి పదవులు ఇచ్చుకోవడానికి చేతనౌతుందంటూ ఫైర్ అయ్యారు షర్మిల. రైతులు చస్తుంటే ఆదుకోవడం చేతకాని మీరు రైతు నేస్తం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. విద్యార్థుల త్యాగాల మీద పదవులను అనుభవిస్తూ వారిని ఆత్మహత్యల బాట పట్టిస్తున్నందుకు మీ గుండెలు రాతి బండలు అయ్యుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement