టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపినట్లు ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందంటే.. ‘నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోవాలంటే మళ్లీ మీరు ముఖ్యమంత్రి కావాలి’ అంటూ ఉంది. దీంతో ఇది నిజంగా షర్మిల చేసి ట్వీట్ అని పొరబడ్డ టీడీపీ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
కట్ చేస్తే ఈ ట్వీట్ ఇది నిజం కాదని, ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ అని షర్మిల వర్గాలు కొట్టిపారేశాయి. కాగా పరిశీలిస్తే వైఎస్ షర్మిల అధికారిక అకౌంట్లో ఈ ట్వీట్ లేదు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం అధికారికంగా ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.