Thursday, November 21, 2024

తెలంగాణ గడ్డ మీద వైఎస్ఆర్ బిడ్డా.. వైఎస్ఆర్టీపీ ఆవిర్భావం

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల తన పార్టీ పేరును అధికారికంగా ‘వైఎస్ఆర్ తెలంగాణ’ అని ప్రకటించారు. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమన్న షర్మిల.. తన పార్టీ జెండాను ఆమె తల్లి విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు.. 20 శాతం నీలిరంగు మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటం.. ఆ మధ్యలో రాజశేఖర్​రెడ్డి బొమ్మ ఉండేలా జెండాను రూపొందించారు.

హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్‌లో షర్మిల పార్టీ ప్రకటన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ ఆశయాల కోసమే తెలంగాణలో తాను పార్టీ పెట్టినట్లు ఇప్పటికే వైఎస్ షర్మిల తెలిపారు. ఇక సభ ప్రారంభానికి ముందే…వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై పార్టీ జెండాను డిస్‌ప్లే చేశారు. ఆ సమయంలోనే తెలంగాణ గడ్డ మీద వైఎస్ఆర్ బిడ్డా అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో వైఎస్ఆర్ పాలనకు పునాది: విజయమ్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement