Friday, November 22, 2024

Real Story: బాలీవుడ్​ మూవీ రేంజ్​లో కిడ్నాప్​ డ్రామా.. ఆఖరికి పోలీసులకు చిక్కి కటకటాల్లోకి..

వాళ్లంతా టీనేజ్​లో ఉన్న యువకులే.. ఇంకా లోకం పోకడల గురించి పూర్తిగా తెలియదు. కానీ, సినిమాల ఎఫెక్ట్​ మాత్రం వారిపై చాలా ఉంది.  వారు సినిమాలను చూసి ఎంతగా రియాక్ట్​ అయ్యారంటే అచ్చం ఓ సినిమాలో చూపించిన విధంగా కిడ్నాప్​ చేసి డబ్బులు కాజేయాలని ప్లాన్​ చేశారు. అది కుదరకపోవడంతో కిడ్నాప్​ చేసిన వ్యక్తిని చంపేశారు. ఇదంతా బాలీవుడ్​ మూవీ ‘‘అపహరన్”​ చూసి, దాని ఇన్​స్పిరేషన్​తోనే  చేశామని పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నారు.

ఢిల్లీలోని బురారీలో ఈ ఘటన జరిగింది. ఓ 18 ఏళ్ల యువకుడిని కిడ్నాప్​ చేసి..  10 లక్షల రూపాయలిస్తేనే వదిలేస్తామని డిమాండ్ చేశారు కొంతమంది యువకులు.  ఆ కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసుకు సంబంధించి పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..  నిందితులిద్దరూ 19 ఏళ్ల వయస్సు గల వాళ్లే. బాలీవుడ్ చిత్రం అపహరన్ నుండి ప్రేరణ పొందారు. షో రూమ్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న నిందితుల్లో ఒకరైన గోపాల్, బాధితుడు రోహన్‌తో ఫ్రెండ్​షిప్​ ఉంది.  జనవరి 23వ తేదీన సాయంత్రం రోహన్‌ని తన పుట్టినరోజు వేడుకకు తీసుకెళ్తానని చెప్పి గోపాల్ కిడ్నాప్ చేశాడు.

రోహన్ తండ్రి మనోజ్ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు కంప్లెయింట్​ చేశాడు. ఈ ఫిర్యాదుతో పోలీసులు సీసీ టీవీలను పరిశీలించారు. దాదాపు 200 సీసీటీవీల ఫుటేజ్​ మొత్తం తనిఖీ చేశారు. తప్పిపోయిన బాలుడితోపాటు అతని స్నేహితుల లొకేషన్లను కనుగొన్నారు. అట్లా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా రోహన్ స్నేహితుడు గోపాల్‌ను మొన్న మిడ్​నైట్​ బురారీలో పట్టుకున్నారు. ఆ తర్వాత వారి స్టైల్​లో జరిపిన ఎంక్వైరీలో మైండ్​ బ్లాక్​ అయ్యే విషయాలు వెల్లడించాడు. తన స్నేహితులతో కలిసి రోహన్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు వెల్లడించాడు. దెబ్బలకు దెయ్యం కూడా దిగొస్తుందన్నట్టు మరో ఇద్దరు సహచరుల పేర్లు కూడా బయటపెట్టాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల సుశీల్‌ను అరెస్టు చేయగా.. మిగతా నిందితులు  పరారీలో ఉన్నారు. 

కేసు డిటెయిల్స్​ ఎంటంటే..

గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు రోహన్‌ను ఒక గదికి తీసుకెళ్లారు. పార్టీ చేసుకున్న తర్వాత వారు అతనిని గొంతు కోసి చంపారు. అనంతరం డెడ్​బాడీని పారేయాలని నిర్ణయించుకుని ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు సినిమాలో మాదిరిగా డబ్బు డిమాండ్​ చేయాలని వారు ప్లాన్ చేసుకున్నారు. మరుసటి రోజు గోపాల్ పనికి వెళ్లినప్పుడు రోహన్ కుటుంబం పోలీసులను ఆశ్రయించడం చూశాడు. దాంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్​ చేశారని గ్రహించిన గోపాల్, అతని సహచరులు మృతుడి మొబైల్ ఫోన్‌ను ఉత్తరప్రదేశ్​కు తీసుకెళ్లారు.  పోలీసుల దృష్టి మరల్చడానికి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను నిరంతరం చేంజ్​ చేస్తూనే ఉన్నారు. అయితే బురారీలోని ఓ గదిలో రోహాన్​ డెడ్​బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement