ఈ మధ్య మంత్రి కేటీఆర్ ఏ పర్యటనకు వెళ్లినా.. నిరసన సెగలు తగులుతున్నాయి. ఇటీవల నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. తాజాగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామలో చోటు చేసుకుంది. ఓ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి యూత్ కాంగ్రెస్ నేతలపై లాఠీ చార్జ్ చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పీఎస్ ముందే కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు.
కాగా, గతంలో నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా కూడా ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మీదుగా వెళుతున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని బీజేవైఎం కార్యకర్తలు ఆపడానికి యత్నించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని నినాదాలు చేశారు.