Friday, November 22, 2024

రోడ్ల దుస్థితిని పెళ్లికూతురి గెట‌ప్ప్ లో చూపించిన యువ‌తి-నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

ఓ పెళ్లి కుమారై రెడ్ శారీ క‌ట్టుకుని ..మెడ‌లో బంగారు న‌గ‌లు భారీగా వేసుకుని ఆమె వీధిలో నడవటం కేరళ సర్కారుకు సమస్యల్ని తెచ్చి పెట్టింది. పట్టుబట్టలతో మెరిసిపోతున్న ఆమెకు భిన్నంగా.. రోడ్లు మొత్తం గోతులతో.. వర్షపు నీటితో నిండి.. నడవటానికి ఇబ్బందికరంగా ఉండటమే కాదు.. చూసినంతనే ఇంత దారుణంగా రోడ్లు ఉండటమా అన్న భావన కలగేలా ఉన్న వైనం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. నిజానికి ఈ పెళ్లి కుమార్తె లక్ష్యం కోసం.. దారుణంగా దెబ్బ తిన్న రోడ్లను ఎవరూ పట్టించుకోకపోవటం.. రోజువారీగా ఆ రోడ్డు నుంచి వెళ్లే వారికి ఎంతో ఇబ్బంది కలుగుతున్న వైనాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లేందుకు.. ఈ పెళ్లి కూతురు ఫోటో షూట్ ను రోడ్డు మీద చేయాలని డిసైడ్ అయింది. తన ఫోటో షూట్ తో అయినా ప్రభుత్వం మనసు మారాలన్నది ఆ పెళ్లి కుమార్తె ఆలోచనగా భావిస్తున్నారు. మొత్తమ్మీదా ఆ పెళ్లి కుమార్తె ఆలోచన వర్క్ వుట్ అయ్యింది. గ‌తుకుల రోడ్డుపై ప్రభుత్వం కన్ను పడిందని చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఫోటో కమ్ వీడియో భారీ ఎత్తున వైరల్ గా మారింది. చాలా తక్కువ వ్యవధిలోనే లక్షలాది మంది వీడియోను.. ఫోటోను చూడటం.. కామెంట్లు రాస్తూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు. వైరల్ గా మారిన ఈ పెళ్లి కుమార్తె ఫోటో షూట్ లక్ష్యమైన.. సదరు రోడ్డు దుస్థితి మారితే.. ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కుతుందన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement