అవయవదానం.. దీనివల్ల ఉపయోగం ఏంటో తెలిసిన వారు మాత్రమే అవయవాలను దానం చేస్తుంటారు. తాము మరణించినా వేరొకరికి ఉపయోగపడాలనే సంకల్పం ఉంటుంది పలువురిలో. ఈ అవయవాల్లో ముఖ్యంగా కళ్ళుని దానం చేస్తుంటారు చాలామంది. తాము మరణించిన తర్వాత తమ అవయవాలను తీసుకోవచ్చని ఒప్పందం చేసుకుంటారు. ఇదే బాటలో ఓ యువతి తాను మరణిస్తే తనలో ఉపయోగపడే అవయవాలన్నింటినీ తీసుకోమని ఓ 23ఏళ్ల యువతి పత్రాన్ని రాసి ఇచ్చింది. కాగా ఆ యువతి రీసెంట్ గా బ్రెయిన్ డెడ్ తో చనిపోయింది. దాంతో ఆ యువతి శరీరంలో ఏడు రకాల అవయవాలను సేకరించారు వైద్యులు. ఆమె చనిపోయినా ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపిందని ప్రశంసలు కురిపించారు.
వివరాలు చూస్తే హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకి గాయాలు అయ్యాయి. కాగా భర్త బతికి బయటపడగా, భార్య మాత్రం బ్రెయిన్ డెడ్ తో మరణించింది. విశేషం ఏంటంటే యాక్సిడెంట్ కు గురైనా అవయావలన్నీ బాగానే ఉన్నాయి. దీంతో వైద్యులు పరీక్షించిన తరువాత ఏడు అవయవాలు వేరొకరికి అమర్చే విధంగా ఉపయోగపడుతాయని గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యలు వాటిని దానం చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తరువాత ఆ మహిళ నుంచి ఏడు రకాల అవయవాలను తీశారు. అనుకోని ప్రమాదంలో తమ అమ్మాయి మరణించినందుకు బాధపడినా.. ఆమె అవయవాలు ఇతరులకు ఉపయోగపడుతున్నందుకు సంతోషించారు. అయితే ప్రతి ఒక్కరు తమ అవయవదానానికి ముందుకు రావాలని కొందరుపిలుపు నిస్తున్నారు. గతంలో నేత్రదానం మాత్రమే చేసేవారు.. రాను రాను అవయవదానానికి ముందుకు వస్తున్నారు.