కొవిడ్ రోగులకు చికిత్స అందించే హైద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఎదుట కరీంనగర్ కు చెందిన యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చండి లేదా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను గాంధీ లో చేర్చండి అంటూ గాంధీ హాస్పిటల్ ముందు నిరసనకు దిగాడు. కరీంనగర్ కి చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడిన కేసీఆర్, కేటీఆర్లు గాంధీలో ఎందుకు చేరడం లేదని ప్రశ్నించారు. కరోనా విళయతాండవం చేస్తున్న మన రాష్ట్రంలో ఇదే అదునుగా భావిస్తూ ఎన్నో ప్రయివేటు ఆసుపత్రులు కరోనా వైద్య చికిత్సల పేర పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటూ, మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సదుపాయాలు లేని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్లలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయివేటు హాస్పిటల్ లో చెర్పించి అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తెలిసి కూడా ప్రజలే మా దేవుళ్ళు ,ప్రజలకోసమే మేము అంటు ఎన్నో గొప్పలు చెప్పే రాజకీయ నాయకులు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చండి లేదా సీఎం కేసీఆర్, కేటీఆర్ లని గాంధీలో చేర్చండి అంటూ శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ను గాంధీలో చేర్చాలంటూ యువకుడి నిరసన
By mahesh kumar
- Tags
- cm kcr
- COVID situation
- COVID-19 patient
- Gandhi hospital
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement