చదివిందేమో బీఎస్సీ కంప్యూటర్స్ , కానీ చేయాలనుకుంది వ్యవసాయం. దాంతో విభిన్నంగా ఆలోచించాడా యువకుడు. దాంతో ప్రకృతి వ్యవసాయంపై మక్కువని పెంచుకున్నాడు. ఈ యువకుడి పేరు గడ్డం అశోక్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామానికి చెందిన యువకుడు. అరుదైన వరి రకాల్ని సాగు చేసేందుకు సిద్ధపడ్డాడు. దాంతో కొత్త రకాల్ని సాగు చేయటం ప్రారంభించాడు. ఈ మేరకు ఈ రంగంలో నిపుణులైన డాక్టర్ సుభాష్ పాలేకర్, విజయ్ రామ్, నారాయణరెడ్డిలతో కలిసి కేరళలో కొంతకాలం పని కూడా చేశాడు అశోక్. వాళ్ల స్ఫూర్తితో 2012లో తనకున్న 3 ఎకరాలకు అదనంగా మరో 2 ఎకరాల్ని కౌలుకు తీసుకొని..అరుదైన వరి రకాల్ని సాగుకు శ్రీకారం చుట్టాడు.
అప్పటి నుంచి ఏటా కొత్త రకాల్ని సాగు చేయటం మొదలు పెట్టాడు. ఆశించినంత మేర పంట చేతికి రావటం మొదలైంది. మంచి లాభాలు సొంతం చేసుకోవటంతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయటం మొదలుపెట్టారు. ఇలా మొదలైన అతని ప్రయాణం స్థానిక రైతుల సహకారంతో 250 రకాల దేశీయ విత్తనాల్ని డెవలప్ చేసి ప్రశంసలు పొందాడు. అంతేకాదండోయ్ అశోక్.. 50 ఆవుల్ని కూడా పెంచుతున్నాడు. జింజువా.. ఈరమణి రకాలకు చెందిన గడ్డిని మహారాష్ట్ర.. రాజస్థాన్ ల నుంచి ప్రత్యేకంగా తెప్పించి పెంచుతున్నారు. దీంతో అధిక పాల ఉత్పత్తికి సాయమవుతుంది. ఇప్పుడు అశోక్ కి పేరుకి పేరు, సంపాదనకి సంపాదన వచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..