Thursday, November 21, 2024

ఆఫీస్ కి వ‌చ్చి తీరాల్సిందే – లేదంటే జాబ్ మానేయండి – ఎలాన్ మ‌స్క్

ఆఫీస్ కి వ‌చ్చి తీరాల్సిందేన‌ని టెస్లా అధినేత ..ప్ర‌పంచ‌కుబేరుడు ఎలాన్ మ‌స్క్ త‌న ఉద్యోగుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇక నుంచి ఇంటి నుంచి పనిచేయడం కుదరదని.. కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని ఉద్యోగులకు తేల్చిచెప్పారు. ఆఫీసుకు రావడం ఇష్టం లేకపోతే టెస్లాను వీడిపోవచ్చంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు సంబంధించి ఉద్యోగులకు మస్క్‌ పంపిన మెయిల్‌ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది.దీర్ఘకాలం ఇంటి నుంచి పనిచేయడం ఆమోదయోగ్యం కాదంటూ మెయిల్ పెట్టిన ఎలాన్ మస్క్.. రిమోట్ వర్క్ చేయాలని భావించేవారు వారానికి కనీసం 40 గంటలు ఆఫీసులో ఉండాలని స్పష్టం చేశారు. ‘ఇతర ప్రాంతం నుంచి పనిచేయడం ఇక నుంచి ఆమోదయోగ్యం కాదు.. ఎవరైనా ఇంటి నుంచి పనిచేయాలని అనుకుంటే వారంలో కనీసం 40 గంటలు ఆఫీసులో ఉండాల్సిందే.. లేదంటే టెస్లా నుంచి వెళ్లిపోవచ్చు.. ఫ్యాక్టరీ కార్మికులకు చెప్పిన దానికంటే ఇది చాలా తక్కువ అంటూ మస్క్ నుంచి ఉద్యోగులకు ఇటీవల మెయిల్ వచ్చింది.

ఆఫీస్‌ అంటే టెస్లా ప్రధాన కార్యాలయం మాత్రమే… విధులకు సంబంధం లేని ఇతర బ్రాంచీలు కాదు.. ఉదాహరణకు ఫ్రీమాంట్ ఫ్యాక్టరీలో మానవ సంబంధాలకు బాధ్యత వహించాలి.. కానీ మీ కార్యాలయం వేరే రాష్ట్రంలో ఉంది’’ అని తన మెయిల్‌లో మస్క్ స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగులకు పంపిన మెయిల్‌ లీకయి ఉండవచ్చని ట్విట్టర్ అనుమానం వ్యక్తం చేసిన ఓ వ్యక్తి.. ఆఫీస్‌కు వెళ్లి పనిచేయడం అనేది పాత పద్ధతి అంటూ కొందరు భావిస్తున్నారు.. దీనిపై మీరేమైనా స్పందిస్తారా అంటూ మస్క్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన మస్క్.. ఈ-మెయిల్‌ ప్రామాణికమైందా? లేదా? అనే విషయాన్ని దాటవేశారు. అటువంటి వారు వేరేచోట్ల పనిచేస్తున్నట్లు అనుకోవాలంటూ జవాబిచ్చారు. కాగా, సంస్థలోని ఉద్యోగుల పట్ల ఎలాన్‌ మస్క్‌ కఠినంగానే వ్యవహరిస్తారని అనేక కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఈ విషయమై గతంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను ఆయనతో పనిచేసిన వారు గుర్తుచేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement