యోగి ఆదిత్యనాథ్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే గడ్డం తీయించుకుంటానని శపథం చేశాడు షాజహాన్ పూర్ నివాసి రాజారామ్. అయితే పార్టీకి మద్దతివ్వడం కోసం కాకుండా తన పరిమితులపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికే ఆయన ఈ ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. సదర్ బజార్ ప్రాంతంలో నివాసం ఉండే మొహల్లా ఝండా కలాన్‌కు చెందిన రాజారామ్.. గతంలొ నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయిన తర్వాత గడ్డం, తల వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే గడ్డం తీయించుకుంటానని చెప్పాడు. యోగి ముఖ్యమంత్రి అయితే ఆయన దయనీయ స్థితిని చూసి ప్రభుత్వం కరుణించి ఇళ్లు, పింఛన్ తదితర ప్రయోజనాలను అందజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కటిక పేద కుటుంబానికి చెందిన రాజారాం ..చెప్పులు కుట్టే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య చనిపోయింది. ఇద్దరు కుమారులు ఉన్నారు, వారిలో పెద్ద కుమారుడు దీపు దివ్యాంగుడు. అందుకే వృద్ధాప్యం తనను తాను శాసించినా వికలాంగుడైన కొడుకుకు ఆసరాగా నిలుస్తున్నాడు. రాజారాం చిన్న కొడుకు ప్రదీప్ పంజాబ్‌లో కష్టపడి పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు పంపిస్తున్న కాస్త డబ్బు తోనే తండ్రీకొడుకుల బతుకుదెరువు సాగుతోంది, కానీ రాజారాం కి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది అందలేదు. ఇప్పటి వరకు తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని అతను చెప్పాడు. కనీసం ఇప్పుడైనా తనను గుర్తించి.. తనకు సహాయం చేస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement